logo

header-ad
header-ad

స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడితే గర్భం వస్తుందట...!!

కొంతమంది అర్ధం పర్థం లేకుండా వ్యాఖ్యలు చేస్తుంటారు.  ఆ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్ధం కావు.  అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా కుదరదు.  స్త్రీ పురుషులు కలిస్తేనే గర్భం వస్తుంది.  ఇప్పుడంటే టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి సరోగసి, మరొకటి టెక్నాలజీ ఉపయోగించి పిల్లల్ని కంటుంటారు.  స్విమ్మింగ్ పూల్ లోకి దిగితే పిల్లలు పుట్టే టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాలేదు.  ఇండోనేషియాకు చెందిన చైల్డ్ హెల్త్ కమిషనర్ ఈ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.  

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.  మహిళలు పురుషులతో కలిసి స్విమ్మింగ్ పూల్ లోకి దిగి స్విమ్ చేయడం వలన మహిళలు గర్భం దాల్చే అవకాశం ఉందని, మహిళలతో కలిసి పురుషులు స్విమ్మింగ్ చేసినపుడు పురుషులు టెంప్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వీర్యం నీళ్లలో స్ఖలిస్తే ఫలితంగా  దాని వలన మహిళలు గర్భం దాలుస్తారని చెప్పింది.  ఈ వ్యాఖ్యలపై ఇండోనేషియాలో దుమారం రేగింది.  తెలియకుంటే మాట్లాడకూడదని, పురుషులు సంస్కారం లేని వ్యక్తులు కాదని కొందరంటే, వైద్యులు మాత్రం క్లోరినేషన్ చేసిన నీటిలో శుక్రకణాలు జీవించలేవని, ఈదలేవని అంటున్నారు.  మొత్తానికి ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్నది.  

Source: https://www.ntvtelugu.com/post/women-can-get-pregnant-in-swimming-pools-with-men

Leave Your Comment