logo

header-ad
header-ad

Woman Molested: చిత్రహింసలు పెడుతూ కామాంధుల పైశాచికం.. ఆపై సోషల్ మీడియాలో దృశ్యాలు.. వీడియో వైరల్‌గా మారడంతో..

Bengaluru Woman Tortured Molested: బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అత్యంత అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా, ఆమెను చిత్రహింసులు పెట్టారు. నిర్భయ తరహా సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ఆరు రోజుల క్రితం బెంగళూరులోని ఎన్‌ఆర్ఐ కాలనీలో 22 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు పాశవికంగా గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. మరో దురదృష్టకర పరిణామం ఏంటంటే.. ఆ నలుగురి యువకులు గ్యాంగ్‌రేప్ చేస్తున్న సమయంలో ఓ యువతి వారికి సహకరించింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

మహిళను చిత్రహింసలు పెట్టన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో మహిళను చిత్రహింసలు పెట్టిన సంఘటనలు మాత్రమే కాకుండా ప్రైవేట్ పార్ట్స్‌లో సీసాను చొప్పించిన ఘటన కూడా రికార్డ్ అయ్యింది. చిత్రహింసలకు గురి చేసిన తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. కాగా, ఈ కేసులో ఆరుగురు బంగ్లాదేశ్ పౌరులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.


గత కొంతకాలంగా బెంగళూరు నగరంలో ముఠాగా ఏర్పడి వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన యువకులతో పాటు వారికి సహకరించిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బంగ్లాదేశ్‌కు చెందిన సాగర్, మహ్మద్ బాబా షేక్, రిదై బాబు, హకీల్‌గా పోలీసులు గుర్తించారు. బాధిత మహిళను బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి అక్రమ రవాణ చేసి తీసుకువచ్చారని పోలీసులు చెప్పారు. నిందితులు బంగ్లాదేశ్ మహిళపై అత్యాచారం జరిపి వీడియో తీశారని బెంగళూరు పోలీసులు చెప్పారు. అత్యాచారం కేసులో నిందితులను కోర్టులో హాజరు పరిచామని పోలీసులు చెప్పారు.

బాధిత యువతి నాగాలాండ్‌కు చెందిన అమ్మాయిగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో గత నాలుగైదు రోజులుగా బంగ్లాదేశ్, నాగాలాండ్ సోషల్ మీడియా పేజ్‌లతో పాటు యూట్యూబ్‌లో కూడా వైరల్‌గా మారింది. ఈ కేసు దర్యాప్తు కోసం ముగ్గురు పోలీసు అధికారుల నేతృత్వంలో మూడు బృందాలను ఏర్పాటు చేశారు.

Source: https://tv9telugu.com/crime/woman-tortured-molested-in-bengaluru-of-karnataka-6-arrested-in-gang-rape-case-475229.html

Leave Your Comment