logo

header-ad
header-ad

ప్రభాస్ తో శ్రద్ధా కపూర్ స్పెషల్ సాంగ్ ?

యాక్షన్ డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ – నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న “సలార్”లో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. కాగా ఆ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీనిధి శెట్టిని తీసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కనిపించబోతుందని తాజాగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తను నమ్మలేం. ఇక కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ను పెట్టాడు ప్రశాంత్ నీల్.

ఆ సాంగ్ ను స్టార్ హీరోయిన్ ‘తమన్నా’ చేత చేయించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సలార్ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయిస్తున్నాడు. కాగా కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

Source: https://www.123telugu.com/telugu/news/shraddha-kapoor-special-song-with-prabhas.html

Leave Your Comment