logo

header-ad
header-ad

కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసింది ఆ ముగ్గురేనా..?

Senior Indian Cricketers Revolted Against Kohli: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం వెనుక గల కారణాలపై గత కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. వర్క్‌ లోడ్‌ కారణంగా పొట్టి క్రికెట్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్నానని స్వయంగా కోహ్లినే ప్రకటించినప్పటికీ.. అతని నిర్ణయం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయన్నది విశ్లేషకులు అభిప్రాయం. 

ఈ విషయమై ఓ ప్రముఖ వార్తా పత్రిక తాజాగా ఓ కథనం ప్రచురించింది. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ పూర్తైన నాటి నుంచి టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లు అశ్విన్‌, రహానే, పుజారాలు కోహ్లిపై అసంతృప్తిగా ఉన్నారని, ఆ ముగ్గురే కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేశారని, దీన్ని పరిగణలోకి తీసుకునే కోహ్లి ప్రమేయం లేకుండా టీమిండియా టీ20 ప్రపంచకప్‌ బృందం ప్రకటించబడిందని, ఇది నచ్చకే కోహ్లి టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడని ఆ కథనంలో పేర్కొనబడింది. 

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో టీమిండియా ఓటమికి పుజారా, ర‌హానే, అశ్విన్‌ల‌ను బాధ్యులని చేస్తూ.. కోహ్లి నోరుపారేసుకోవడంతో వివాదం మొదలైందని, అది కాస్తా చినికిచినికి గాలివానలా మారి కోహ్లి టీ20 కెప్టెన్సీకే ఎసరు పెట్టిందని ప్రచురించింది. అలాగే, టీ20 ప్రపంచక‌ప్ త‌ర్వాత కోహ్లి వ‌న్డే కెప్టెన్సీపైనా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉందని పేర్కొంది. 

Source: https://www.sakshi.com/telugu-news/sports/senior-indian-cricketers-revolted-against-virat-kohli-and-complaint-bcci-says

Leave Your Comment