logo

header-ad
header-ad

భువీ స్థానంలో తెలుగు కుర్రాడు పృథ్వీకి చోటు

దుబాయ్: పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ గాయాలతో ఈ ఐపీఎల్‌ సీజన్ నుంచి వైదొలిగాడు. సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ విభాగంలో కీలకంగా ఉన్న భువీ లేకపోవడంతో ఆ స్థానంలో యర్రా పృథ్వీ రాజ్‌కు చోటు దక్కింది. 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 9 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, మూడు టీ20 మ్యాచ్‌ల్లో ఆడిన పృథ్వీ.. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 39 వికెట్లు, టీ20 క్రికెట్‌లో నాలుగు వికెట్లు తీశాడు. పృథ్వీ రాజ్ తెలుగు రాష్ట్రమైన ఏపీకి చెందిన ఆటగాడు కావడం విశేషం. పృథ్వీ స్వస్థలం గుంటూరు జిల్లా దుగ్గిరాల. 2019లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరపున పృథ్వీ ఆడాడు.

ఈ నెల 2న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఆటగాడు భువనేశ్వర్‌కు తొడ కండర గాయమైంది. 30 ఏళ్ల భువీ గాయం తీవ్రత విషయమై స్పష్టమైన సమాచారం లేకున్నా..అది పూర్తిగా మానేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలు పట్టవచ్చని తెలుస్తోంది. ‘తొడ కండర గాయంతో ఐపీఎల్‌ నుంచి భువనేశ్వర్‌ తప్పుకొన్నాడు. దాన్ని గ్రేడ్‌-2 లేదా మూడో స్థాయి గాయంగా అంచనా వేస్తున్నాం. దాంతో అతడు దాదాపు రెండు నెలలు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇక.. భువీ ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆసీస్‌తో సిరీస్‌కు కూడా భువీ అందుబాటులో లేనట్టే’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

Source: https://www.andhrajyothy.com/telugunews/prithvi-raj-yarra-to-replace-injured-bhuvneshwar-kumar-2020100603562648

Leave Your Comment