logo

header-ad
header-ad

పెళ్లి చేసుకొని ఏళ్ళు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదట... విషయం తెలిసి షాకైన డాక్టర్...

అదేదో సినిమాలో చెప్పినట్టు చందమామను చూస్తూ మహేష్ బాబు లాంటి పిల్లల్ని కంటానని చెప్పడం  చూస్తుంటే అది సినిమా కదా సరిలే అనుకోవచ్చు.  కానీ, నిజ జీవితంలో ఇలాంటివి జరుగుతాయా అంటే ఏమో చెప్పలేం జరగొచ్చు.  మన దగ్గర మూఢ నమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు.  కానీ, సాంకేతికంగా అభివృద్ధి సాధించిన దేశాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగితే... జరిగితే ఏంటి జరిగింది. 

లండన్ కు చెందిన రాచెల్ అనే వైద్యురాలి వద్దకు ఓ కేసు వచ్చింది.  తమకు పెళ్ళయ్యి చాలా కాలం అయ్యిందని, కానీ పిల్లలు పుట్టడం లేదని చెప్పడంతో, అన్ని టెస్టులు చేశారు.  రోజుకు ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొంటారని రాచెల్ ఆ జంటను అడిగింది.  దీంతో సెక్స్ అంటే ఏంటి ... ఎలా ఉంటుంది అని అడిగారట.  పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారని అనుకున్నామని చెప్పారట. 

దీంతో  షాకైన వైద్యురాలు... వారికి సెక్స్ మీద అవగాహన కల్పించారు.  సెక్స్ అంటే ఎలా ఉంటుంది, ఎందుకు మనిషి అవసరం అనే విషయాలపై అవగాహన కల్పించినట్టు రాచెల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నది. 

Source: https://www.ntvtelugu.com/post/married-couple-didnt-know-they-had-to-have-sex-to-make-a-baby-reveals-nhs-nurse

Leave Your Comment