logo

header-ad
header-ad

26 ఏళ్ల వయసులో ఆమెను ఇష్టపడ్డాను

మహేశ్‌బాబు ఫేవరెట్‌ కలర్‌ ఏంటి? ఆయనకు వంటొచ్చా? ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతారు? మహేశ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు? మహేశ్‌కి తన కుమార్తె సితార ఎక్కువ ఇష్టమా? కుమారుడు గౌతమ్‌ ఎక్కువ ఇష్టమా? ఆదివారం మహేశ్‌బాబు తన ఫ్యాన్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్‌ చేశారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సరదా సమాధానాలు ఇచ్చారు. ఆ విశేషాలు.

► మీకు బాగా ఇష్టమైన రంగు, ఫుడ్‌?
మహేశ్‌బాబు : నచ్చిన రంగు బ్లూ. హైదరాబాద్‌ బిర్యానీ.

► లాక్‌డౌన్‌లో ఫ్యామిలీతో గడపడం ఎలా అనిపిస్తోంది?
నా జీవితంలో మర్చిపోలేని అనుభవం ఇది. వాళ్లతో చాలా క్వాలిటీ సమయాన్ని గడిపాను. ఒకవేళ పని (షూటింగ్‌) చేస్తూ ఉంటే ఇలాంటి ఫన్‌ కచ్చితంగా ఉండేది కాదు.

► మీకు ఇష్టమైన ఆట ఏంటి?
మా అబ్బాయి గౌతమ్‌తో టెన్నిస్, గోల్ఫ్, బేస్‌బాల్‌ వంటి గేమ్స్‌ను ఆన్‌లైన్‌లో ఆడటానికి ఎక్కువ ఇష్టపడతాను.

► మీ పిల్లల కోసం మీరు వండగలిగే బెస్ట్‌ వంటకం ఏంటి?
మ్యాగీ న్యూడిల్స్‌.

► మీకు స్ఫూర్తి ఎవరు?
మా నాన్నగారు (కృష్ణ).

► మీ నాన్న గురించి ఒక్క మాటలో చెప్పాలంటే?
ఒక్క మాటలో ఆయన్ని వివరించడం చాలా కష్టం.

► రష్మిక ఇష్టమా? సమంత ఇష్టమా?
వాళ్లిద్దరూ నాకు బాగా తెలుసు. నా బెస్ట్‌ కో–స్టార్స్‌.

► మీరు ఇంత అందంగా ఉండటం వెనక సీక్రెట్‌ ఏంటి?
మీ పొడగ్తలకు థ్యాంక్స్‌. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి చాలా కష్టపడుతుంటాను.

► ఈ లాక్‌డౌన్‌ మీ లైఫ్‌ స్టయిల్లో ఏదైనా మార్పు తీసుకువచ్చిందా?
పెద్దగా మార్పేమీ లేదు. నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా నా రొటీన్‌ ఒకేలా ఉంటుంది. త్వరగా నిద్రపోవడం, ఉదయాన్నే నిద్రలేవడం నాకు అలవాటు.

► పని పట్ల మీరు చాలా ఫోకస్డ్‌గా ఉండటానికి కారణం?
పర్ఫెక్షన్‌ కోసం తపించడం నా అలవాటు.

► ‘జేమ్స్‌ బాండ్‌’ లాంటి సినిమాలో మిమ్మల్ని చూడాలనుంది.
నాకూ చేయాలనుంది. నీ దగ్గర ఏదైనా స్క్రిప్ట్‌ ఉంటే పంపు.

► అందరి దృష్టిలో మీరు ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు?
ఒక గొప్ప నటుడిగా, మా పిల్లలకు గొప్ప తండ్రిగా, నా భార్యకు గొప్ప భర్తగా గుర్తుండాలనుకుంటా.

► ‘సర్కార్‌వారి పాట’లో హీరోయిన్‌ ఎవరు?
ఎవరైతో బావుంటారో నువ్వే చెప్పు.

► పూరి జగన్నాథ్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు?
నా అభిమాన దర్శకుల్లో పూరీగారు ఒకరు. ఆయన కథ ఎప్పుడు చెబుతారా అని ఎదురుచూస్తున్నా.

► బాగా వర్షం పడుతోంది. ఏం స్నాక్స్‌ తింటే బావుంటుంది అనుకుంటున్నారు.
మిర్చి బజ్జీ, అల్లం టీ.

► రాజమౌళిగారితో సినిమా ఎప్పుడు ఉంటుంది?
కచ్చితంగా ఉంటుంది.

► మీరు పుస్తకాలు చదువుతారా? 
అవును. ప్రస్తుతం ‘సేపియన్స్‌’ చదువుతున్నా.

► ఇష్టమైన్‌ మార్వెల్‌ సూపర్‌ హీరో?
ఐరన్‌ మేన్, హల్క్‌.

► ఎవరి మీదైనా క్రష్‌ ఉందా?
26 ఏళ్ల వయసులో ఒకామె (నమ్రత) మీద ఉండేది. ఆ తర్వాత తననే పెళ్లి చేసుకున్నాను.

► గౌతమ్‌ , సితార.. ఎవరెక్కువ ఇష్టం?
వాళ్లిద్దరూ నాలో భాగమే. అందులో ఒకర్ని తక్కువ ఎలా ఇష్టపడతాను?

► మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు?
నమ్రత.

► ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతారు?
పుస్తకాలు చదువుతా. సినిమాలు చూస్తాను. ఈత కొడతాను. మా పిల్లలతో ఆడుకుంటాను. మా కుక్కలతో సమయం గడుపుతాను.

► మీ అభిమానుల గురించి? 
మీ ప్రేమాభిమానాల వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. మీకు మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. మీ అందర్నీ ప్రేమిస్తాను. అందరూ ఇంట్లోనే ఉండండి. క్షేమంగా ఉండండి.

► గౌతమ్‌ భవిష్యత్తులో హీరో అవుతాడా?
తనకి ఆ ఆలోచన ఉన్నట్టు అనిపిస్తోంది. చూద్దాం.. కాలమే సమాధానం చెబుతుంది.

► లాక్‌డౌన్‌ తర్వాత లైఫ్‌ ఎలా ఉండబోతోంది?
కచ్చితంగా భిన్నంగా ఉండబోతోంది. ఆ మార్పుని అందరం అంగీకరించి జీవించాలి. మాస్క్‌ వేసుకుని జాగ్రత్తగా ఉందాం.

హ్యాట్రిక్‌ ప్రారంభం
సూపర్‌స్టార్‌ కృష్ణ బర్త్‌డేకి కొత్త సినిమా అప్‌డేట్స్‌ ఇవ్వడం మహేశ్‌బాబు అలవాటు. ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో చేయనున్న సినిమాకి ‘సర్కారు వారి పాట’ టైటిల్‌ అని కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆదివారం ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. పొడుగు జుట్టు, చెవి పోగు, మెడ మీద రూపాయి బిళ్ల ట్యాటూతో మహేశ్‌ లుక్‌ని విడుదల చేశారు. ‘‘మహర్షి, సరిలేరు నీకెవ్వరు’ తర్వాత హ్యాట్రిక్‌కి బ్లాక్‌బస్టర్‌ ఆరంభం ఇది’’ అని లుక్‌ని రిలీజ్‌ చేశారు మహేశ్‌.

Source: https://www.sakshi.com/news/movies/mahesh-babu-chit-chat-his-fans-1290600

Leave Your Comment