Liquor Shops: రాబోయే కొత్త మద్యం పాలసీల ప్రకారం.. వైన్స్ షాపులు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలకు అత్యధికంగా ఆదాయం వచ్చేది ఎక్సైజ్ శాఖ నుంచి. మద్యం షాపుల ద్వారా ఎంతో ఆదాయం సమకూర్చుకుంటోంది. ఇక ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ తీసుకురానుంది ప్రభుత్వం. ఢిల్లీలో అక్టోబర్ 1వ తేదీ నవంబర్ 16 వరకు ప్రైవేటు మద్యం షాపులను మూసివేయనుంది ఢిల్లీ సర్కార్. దీంతో 47 రోజుల పాటు ప్రభుత్వ మద్యం దుకాణాలలో మాత్రమే మద్యం విక్రయించబడుతుందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. ఢిల్లీని 32 జోన్లుగా విభజించడం ద్వారా లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఇప్పుడు కొత్త ఎక్సైజ్ పాలసీ కింద నవంబర్ 17 నుండి ఢిల్లీలో షాపులు తెరవబడతాయని, ఈ సమయంలో అక్టోబర్ 1 నుంచి ప్రైవేటు మద్యం షాపులను మూసివేయనున్నట్లు వెల్లడించారు. కొత్త మద్యం పాలసీ అనంతరం నవంబర్ 17 నుంచి షాపులన్నీ తెరవనున్నట్లు పేర్కొన్నారు.
ఢిల్లీలో ప్రస్తుతం 720కి పైగా మద్యం షాపులు ఉన్నాయి. 260 ప్రైవేట్, 460 ప్రభుత్వ దుకాణాలు ఉన్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీ నేపథ్యంలో ప్రైవేటు మద్యం షాపుల లైసెన్స్‌లను పొడిగించిన ప్రభుత్వం.. సెప్టెంబర్ 30 తర్వాత లైసెన్స్‌లను జారీ చేయదు. ఈ కారణంగా అక్టోబర్ 1 నుండి మొత్తం 260 మద్యం దుకాణాలు మూసివేయబడతాయయని ఆయన అన్నారు. ఇక కొత్త ఎక్సైజ్ పాలసీ కింద జారీ చేయబడిన లైసెన్సులు నవంబర్ 17 తెరవనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రైవేటు మద్యం దుకాణాల మూసివేతతో 47 రోజుల పాటు ఢిల్లీలోని ప్రభుత్వ దుకాణాలలో మాత్రమే మద్యం విక్రయించబడుతుంది.