logo

header-ad
header-ad

Viral Photo: ఇడ్లీలు గుండ్రంగానే ఉండాలా.? పుల్ల ఐస్‌లా ఉండకూడదా.. ఈ ఆలోచనకు ప్రతి రూపమే..

Viral Photo: ఎక్కువ మంది ఇష్టపడి తినే టిఫిన్స్‌లో ఇడ్లీ మొదటి స్థానంలో ఉంటుంది. వేడి వేడి ఇడ్లీలను చెట్నీ లేదా సంబారులో ముంచుకొని తింటే ఆ కిక్కే వేరని భావించే వారు మనలో చాలా మంది ఉంటారు. అయితే మీరు ఇప్పుటి వరకు చూసిన ఇడ్లీల ఆకారం ఎలా ఉంటుంది.? అదేం ప్రశ్న.. ఇడ్లీలు ఎక్కడైనా ఒకేలా గుండ్రంగా ఉంటాయని సమాధానం ఇస్తారా. కానీ బెంగళూరుకు చెందిన ఓ రెస్టారెంట్‌ రూపొందించిన ఇడ్లీలను చూస్తే మీ అభిప్రాయాన్ని కచ్చితంగా మార్చుకుంటారు. ఇడ్లీలు గుండ్రంగానే ఎందుకు ఉండాలనే ఆలోచనతో ఇలా చేశారో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ కొత్త రకం ఇడ్లీలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌ కస్టమర్లకు ఆకర్షించేందుకు వినూత్న ప్రయత్నం చేసింది. సాధారణంగా గుండ్రంగా ఉండే ఇడ్లీలను పుల్ల ఐస్‌ రూపంలో తయారు చేసి విక్రయిస్తోంది. ఇడ్లీ పిండికి ఐస్‌క్రీమ్‌ పుల్లను జోడించి.. అచ్చతంగా పుల్ల ఐస్‌ రూపంలో తయారు చేశారు. ఈ వెరైటీ ఇడ్లీలను కొందరు ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు రెస్టారెంట్‌ నిర్వాహకుల క్రియేటివిటీకి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. ఏదేమైనా కస్టమర్లను అట్రాక్ట్‌ చేయడం కోసం చేసిన ఈ కొత్త రకం ఇడ్లీలు నిజంగానే వావ్‌ అనిపిస్తున్నాయి. మరి ఈ పుల్ల ఐస్‌ ఇడ్లీలపై మీరూ ఓ లుక్కేయండి..

..

Source: https://tv9telugu.com/trending/bengaluru-restaurant-made-diffrent-shape-idlis-as-ice-cream-idli-viral-photo-549340.html

Leave Your Comment