logo

header-ad
header-ad

చేయనంటూనే వరుసగా చేస్తోన్న అనసూయ

జబర్దస్త్ యాంకర్ అనసూయ బుల్లి తెరపై మాత్రమే కాకుండా సినిమాలతో కూడా బిజీగా ఉంటోంది. టాలీవుడ్ లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త వంటి పాత్రను పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది. పుష్ప లో కూడా అలాంటి తరహా పాత్రను చేయబోతున్నట్లుగా ఇప్పటికే అనసూయ క్లారిటీ ఇచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ హీరోగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో అనసూయ ప్రత్యేక పాటలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అనసూయ కొన్నాళ్ల క్రితం తాను ఐటెం సాంగ్స్ చేయను అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఒక సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో ఆమెను నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఐటెం సాంగ్ చేయను అన్నారు కదా మళ్లీ ఎందుకు ఐటెం సాంగ్ చేశారు అంటూ ప్రశ్నించారు.

ఐటెం సాంగ్ కాదు అది ప్రత్యేక పాట అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసినా కూడా అనసూయను చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. చివరకు అనసూయ ఆ విషయమై జనాల నోళ్లు మూయించేందుకు ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత పుష్ప వంటి ప్రతిష్టాత్మక సినిమాలో ఆఫర్ ను దక్కించుకోవడంతో అనసూయ ఇక ఐటెం సాంగ్స్ చేయక పోవచ్చు అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేశారు. పుష్ప సినిమా లో ఆమె పాత్ర ఎలా ఉంటుందా అంటూ ఎదురు చూస్తున్న వారికి షాక్ ఇచ్చేలా అన్నట్లుగా అనూహ్యంగా రవితేజ మూవీలో ఐటెం సాంగ్ ను అనసూయ చేయబోతుంది అనే వార్తలు మొదలు అయ్యాయి. అనసూయ ప్రథాన పాత్రలో కూడా ఒకటి రెండు సినిమాలు రూపొందుతున్నాయి.

ఒక వైపు హీరోయిన్ గా నటిస్తూ మరో వైపు పెద్ద సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ కూడా అనసూయ ఐటెం సాంగ్స్ ను చేసేందుకు కమిట్ అవుతోంది. పైగా ఐటెం సాంగ్స్ చేయను అంటూనే అనసూయ ఐటెం సాంగ్స్ ను చేస్తుంది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం ఆమెను ఐటెం సాంగ్స్ తో పాటు అన్ని రకాలుగా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అనసూయ ఐటెం సాంగ్స్ లో నటించడం తమకు సంతోషమే అని.. ఆమె రెగ్యులర్ గా ఐటెం సాంగ్స్ చేయడంతో పాటు హీరోయిన్ గా నటించాలి.. అంతే కాకుండా రంగమ్మత్త వంటి పాత్రలను మళ్లీ మళ్లీ ఆమె చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Source: https://www.tupaki.com/movienews/article/Anasuya-is-going-to-appear-in-a-special-song/305890

Leave Your Comment