logo

header-ad
header-ad

‘కిలేడి’ మహిళ.. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చి..

కృష్ణాజిల్లా: గన్నవరం ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చిన ఒక మహిళ.. మరో మహిళ బ్యాగ్‌లో నుంచి రూ.65 వేల రూపాయాలను కాజేసింది. ఆ తర్వాత మహిళ, పిల్లలతో సహా అక్కడ నుంచి పరారయ్యింది. కాగా, బాధిత మహిళ తన బ్యాగ్‌లో డబ్బులు కన్పించపోవడంతో కంగారుగా వేతికింది.

ఈ క్రమంలో బ్యాంక్‌లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా గుర్తుతెలియని మహిళ డబ్బును కాజేసిన దృశ్యాలు బయటపడ్డాయి. బాధిత మహిళ బ్యాంకులోని సీసీ ఫుటేజీ ఆధారంగా.. నిందితురాలిపై  గన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలేడీ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. 

Source: https://www.sakshi.com/telugu-news/crime/woman-steals-money-bag-andhra-bank-vijayawada-1399922

Leave Your Comment