ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారిపోతున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వం నుంచి తాలిబన్ల చేతిలోకి ప్రభుత్వం వెళ్లిపోవడంతో అక్కడ అరాచకాలు పెరుగుతున్నాయి. ఇతర ఉగ్రవాద సంస్థలు యధేచ్చగా రెచ్చిపోతున్నాయి. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని విధ్వంసాలు సృష్టిస్తున్నారు. శుక్రవారం రోజున జరిగిన బ్లాస్టింగ్‌లో 100 మంది వరకు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరంలో హోటళ్లు, టూరిస్టులను టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు అమెరికా హెచ్చరించింది. కాబూల్‌లోని సెరెనా హోటల్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని, అమెరికా, బ్రిటన్ పౌరులు ఆ ప్రదేశాలను వీలైనంత త్వరగా ఖాళీ చేసి వెళ్లాలని అమెరికా సూచించింది. దీంతో ఆ ప్రాంతంలో తాలిబన్ ప్రభుత్వం దృష్టిసారించింది.

Source: https://ntvtelugu.com/usa-alert-to-citizens-in-kabul/