logo

header-ad
header-ad

మహేష్ బాబు పెళ్లి సీక్రెట్ బయటపెట్టిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ముగింపు దశకు చేరుకొంది. గత కొన్ని వారాలుగా విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ తాజా సీజన్ త్వరలో ఎండ్ కాబోతోంది. ఇక ఈ చివరి ఎపిసోడ్ ని సూపర్ స్టార్ మహేష్ తో ప్లాన్ చేసిన సంగతి తెల్సిందే. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలించాయి. ఫిబ్రవరి 4 న ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ స్పెషల్ ఎపిసోడ్ స్పెషల్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి నుంచి మహేష్- బాలయ్య కాంబో ఎపిసోడ్ పై అభిమానుల అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక తాజాగా ఈ స్పెషల్ ప్రోమోతో అవి ఇంకా రెట్టింపు అయ్యాయి. బాలయ్య పంచ్ లు, మహేష్ సెటైర్లతో ఈ ఎపిసోడ్ ఉండబోతున్నట్లు కనిపిస్తోంది.

`ఇంత యంగ్ గా వున్నావేంటయ్యా బాబూ.. అని బాలకృష్ణ అడగడంతో మొదలైన ప్రోమో ఆద్యంతం నవ్వులు పూయించింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు మహేష్ మూడేళ్లు గ్యాప్ తీసుకోవడం .. దానికి కారణం అడిగి కొద్దిగా ఎమోషనల్ టచ్ ఇచ్చిన బాలయ్య ఆ తరువాత మహేష్ నాదో చిన్న కోరిక.. నా డైలాగ్ నీ గొంతులో వినాలని వుంది.. అని బాలకృష్ణ అడగడం… `మీ డైలాగ్ మీరు తప్ప ఇంకెవరూ చెప్పలేరు సార్` అని మహేష్ చెప్పడం.. కవర్ చేస్తున్నావ్ అని బాలయ్య పంచ్ వేయడం నవ్వులు పూయిస్తోంది. ఇక చివర్లో `వెకేషన్ అని చెప్పి పెళ్లి చేసుకున్నావ్ .. ఏంటంట సీక్రెట్..? అని పంచ్ వేయగానే మహేష్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ అదిరిపోయింది. మహేష్ పెళ్లి అప్పట్లో ఒక సంచలనం అని చెప్పాలి. వంశీ చిత్ర సమయంలో నమ్రత తో ప్రేమలో పడిన మహేష్.. ఇంట్లో ఒప్పించడం.. వెంటనే ఆమెను పెళ్లాడడం జరిగిపోయాయి. అయితే అప్పట్లో మహేష్ పెళ్లి సీక్రెట్ గురించి చాలా పుకార్లు వచ్చాయి. మరి ఆ పుకార్లకు మహేష్ ఈ షో లో చెక్ పెడతాడా..? లేదా అనేది చూడాలి.

Source: https://ntvtelugu.com/unstoppable-with-nbk-season-finale-premieres-tomorrow/

Leave Your Comment