logo

header-ad
header-ad

High Court: రేపిస్ట్‌ రాజు మరణంపై జ్యుడీషియల్‌ విచారణకు హైకోర్టు ఆదేశం

రేపిస్ట్‌ రాజు కేసు అప్పుడే ముగిసిపోలేదు. రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న రాజు మృతిని హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. రాజు మృతిపై జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించింది హైకోర్టు. వరంగల్ మూడో మెజిస్ట్రేట్‌ ఈ కేసును విచారణ జరపాలను ఆదేశాలు జారీచేసింది. నాలుగు వారాల్లో సీల్డ్ కవర్‌లో ఈ నివేదిక సమర్పించాలంది ఉన్నత న్యాయస్థానం. అయితే రాజు ఆత్మహత్య చేసుకున్నాడని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నివేదిక అందించింది. ఇప్పటివరకు ఏడుగురు సాక్షులను విచారించామన్నారు తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ BS ప్రసాద్‌. పోస్ట్‌మార్టమ్‌ను కూడా వీడియోగ్రఫీ చేశామన్నారు. ఈ వీడియోగ్రఫీతోపాటు.. పోస్టుమార్టమ్‌ నివేదికను రేపు రాత్రి 8 గంటలలోపు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Source: https://tv9telugu.com/crime/telangana-high-court-hearing-on-saidabad-rape-and-murder-case-accused-raju-death-case-539755.html

Leave Your Comment