logo

header-ad
header-ad

Petrol-Diesel Rates Today: వాహనదారులకు ఊరట ఇస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజా రేట్ల వివరాలు..

Petrol-Diesel Price Today: వాహనదారులకు కొంత ఊరట కలిగిస్తున్నాయి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు. గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన ధరలు.. ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల స్వల్పంగా తగ్గుముఖం పట్టి.. అప్పటి నుంచి నిలకడగా ఉన్నాయి. చమురు ధరలు వంద రూపాయలు దాటిపోవడంతో ధరలను తగ్గించాలని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ముందే నిత్యవసర సరుకులు, గ్యాస్‌ ధరలు పెరుగుతుండటంతో భారంగా మారుతున్న సామాన్య జనాలకు.. ఈ పెట్రోల్‌ ధరలు నడ్డి విరుస్తున్నాయి. తాజాగా శనివారం (సెప్టెంబర్‌ 18) పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దేశంలో అక్కడక్కడ స్వల్ప మార్పులు కనిపించాయి. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.62 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 91.71 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.12ఉండగా.. డీజిల్ ధర రూ.93.36గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.04 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.30 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.89.02గా ఉంది.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 96.80గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.96.80గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.13గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.49గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.39గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26 ఉండగా.. డీజిల్ ధర రూ.96.69గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.77 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.23గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.51 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.44 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.71 ఉండగా.. డీజిల్ ధర రూ. 97.65 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.08లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.99గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.75గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.66గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.51 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.98.44లకు లభిస్తోంది.

 

 

Source: https://tv9telugu.com/business/petrol-diesel-prices-today-no-revision-in-fuel-rates-for-13th-day-in-a-row-check-rates-here-540088.html

Leave Your Comment