logo

header-ad
header-ad

Vk Naresh: శ్రీకాంత్‌ జాగ్రత్తగా ఉండు!

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాద ఘటన నేపథ్యంలో మా అధ్యక్షుడు నరేశ్‌ ఓ వీడియో బైట్‌ ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే! దానికి కౌంటర్‌గా శ్రీకాంత్‌ ఇచ్చిన వీడియోలో నరేశ్‌ మాట్లాడిన తీరు పట్ల శ్రీకాంత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ుబైట్‌ ఇచ్చేటప్పుడు ఓసారి ఆలోచించి మాట్లాడండి’ అని ఆయన సూచించారు. నరేష్‌ ఇచ్చిన బైట్‌ కరెక్ట్‌ కాదనిపించింది. ఎందుకనో ఈ టైమ్‌లో చనిపోయిన వారి గురించి ప్రస్తావించకుండా ఉంటే బాగుండేదేమో.. అని నాకు అనిపించింది’’ అని శ్రీకాంత్‌ ఇచ్చిన బైట్‌కు నరేశ్‌ మంగళవారం కౌంటర్‌ వీడియో వదిలారు. ''శ్రీకాంత్‌ ఏంటమ్మా బైట్‌ అలా ఇచ్చావ్‌. సాయిధరమ్‌ తేజ్‌ ఆ సమయంలో స్పీడ్‌లో లేడు. బురద ఉండడం వల్ల జారిపడ్డాడు. నేను చెప్పిన బైట్‌లో తేడాను సరిదిద్దుకున్నాను. బైట్స్‌ ఇచ్చేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను చనిపోయినవాళ్ల గురించి మాట్లాడలేదు. జనరల్‌గా ఇండస్ట్రీలో జరిగిన వాటి గురించి మాట్లాడాను. బైక్‌లను మనం చాక్లెట్స్‌లాగా పిల్లలకు ఇవ్వము. ప్రమాదాలు ఎవరికైనా జరుగుతాయి. కానీ నువ్వ ఇచ్చిన బైట్‌ వల్ల హర్ట్‌ అయ్యాను. నా కళ్ల ముందు నువ్వు హీరోగా  వచ్చి మంచి సినిమాలు చేసి ఎదిగావ్‌. మా ఎన్నికల్లో నా ఎదురు ప్యానల్‌ ద్వారా పోటీ చేసి ఓడిపోయావ్‌? దయచేసి ఇంకోసారి ఇలాంటి బైట్స్‌ ఇవ్వవద్దు’’ అని నరేశ్‌ స్పందించారు.

అయితే ప్రమాద స్థలంలో ఇసుక, మట్టి ఉంది కానీ బురద ఎక్కడ ఉంది నరేశ్‌ అని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. గత మా ఎన్నికల్లో తన ఎదురు ప్యానల్‌ నుంచి పోటీ చేసి శ్రీకాంత్‌ ఓడిపోయాడనే విషయాన్ని ప్రస్తావించడం ఇప్పుడు సముచితం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

 

Source: https://chitrajyothy.com/telugunews/naresh-counter-to-srikanth-avm-mrgs-chitrajyothy-1921091401520865

Leave Your Comment