logo

header-ad
header-ad

వివాహం చేసుకోవాలని అఫ్గాన్‌ మహిళలపై ఒత్తిడి

కాబుల్‌: అఫ్గానిస్తాన్‌ మహిళల పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది. తాలిబన్ల నుంచి తప్పించుకొని వలస వెళ్లాలంటే తమను వివాహం చేసుకోవాలని ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. అనేక మంది మహిళలను బలవంతం చేస్తున‍్న సంఘటనలు కాబుల్‌ విమానాశ్రయం వెలుపల వెలుగుచూస్తున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) తరలింపు కేంద్రంలో వెలుగుచూసిన ఈ మానవ అక్రమ రవాణా ఉదంతంపై అమెరికా దౌత్య అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో.. అఫ్గాన్‌ నుంచి పారిపోవడానికి, కొన్ని కుంటుంబాల మహిళలను వివాహం చేసుకోవడానికి లేదా భర్తలుగా నటించి  దేశం దాటించేందుకు ఉపక్రమించారు.

ఈ ఘటనలు తాలిబన్ల కిరాతక పాలన నుంచి తప్పించుకోవాలనే అక్కడి మహిళల పరిస్థితికి అద్దం పడుతోంది. అమెరికా దౌత్యాధికారులు ఇటువంటి మానవ అక్రమ రవాణా సంఘటనలను గుర్తించి వారికి సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. కాగా అమెరికా దళాలు ఆగస్ట్ 30న అఫ్గన్‌ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీనితో 20 యేళ్ళ సుదీర్ఘ యుద్ధానికి తెరపడింది. అయితే తాలిబన్ల పాలన ప్రారంభమయ్యాక మహిళల కనీస హక్కులులేని గత తాలిబన్‌ పాలనను గుర్తుచేసేలా ఉంది. అంతేకాకుండా మగ కుటుంబ సభ్యుడు లేని మహిళల ప్రయాణాలను తాలిబన్లు నిషేధించారు. ఈ పరిస్థితుల్లో కొన్ని పైవేటు గ్రూపులు తాలిబన్లు తమను వెంటాడుతున్నారని తెలిస్తే తప్ప దేశం సరిహద్దులు దాటవద్దని సూచించారు.

Source: https://www.sakshi.com/telugu-news/international/marriage-proposal-woman-who-wants-escape-afghanistan-1392888

Leave Your Comment