logo

header-ad
header-ad

‘మా’ సభ్యులకు విష్ణు విందు

‘మా ఎన్నికల నేపథ్యంలో విందు, సన్మాన రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడడంతో.. అధ్యక్ష పోటీలో ఉన్న అభ్యర్థులు తమదైన శైలీలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ‘మా’ మెంబర్స్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. 

మూడు రోజుల క్రితం ప్రకాశ్‌రాజ్‌ గణపతి కాంప్లెక్స్‌ ప్రాంతంలో చిన్న కళాకారులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు. శనివారం జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో సినీ నటీనటులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లంచ్‌ మీట్‌ కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో తన ప్యానల్‌ గెలిస్తే సభ్యుల సంక్షేమం కోసం రూ.10 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తానని ప్రకాష్‌ రాజ్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే! 

ఇదిలా ఉండగా మరో అభ్యర్థి మంచు విష్ణు సోమవారం రాత్రి పార్క్‌ హయత్‌ వేదికగా ‘మా’ సభ్యులకు డిన్నర్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమంలో ‘మా’ అభివృద్ధిపై విష్ణు తన ఆలోచనలను, భవిష్యత్తు తమ కార్యచరణను సభ్యుల ముందు ఉంచినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకూ తన ప్యానల్‌ గురించి బయటపెట్టలేదు. ఈ నెల 19న ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక తమ ప్యానల్‌తోపాటు మ్యానిఫెస్టోను బయట పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. గుట్టుగా జరుగుతున్న మీటింగ్‌లు, విందు కార్యక్రమాల హడావిడి చూసినవారంతా జనరల్‌ ఎలక్షన్ల తరహాలో మా ఎన్నికలు జరగనున్నాయని కామెంట్స్‌ చేస్తున్నారు.

 

Source: https://chitrajyothy.com/telugunews/manchu-vishnu-dinner-for-maa-members-avm-mrgs-chitrajyothy-192109140818128

Leave Your Comment