logo

header-ad
header-ad

ఆయన గబ్బర్‌సింగ్‌ అయితే.. నేను ధర్మేంద్ర!

పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ‘డేనియల్‌ శేఖర్‌’గా నటిస్తున్న రానా పరిచయ చిత్రాన్ని సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. ‘నీ మొగుడు గబ్బర్‌ సింగ్‌ అంట.? స్టేషన్‌లో టాక్‌ నడుస్తోంది. నేనెవరో తెలుసా ధర్మేంద్ర.. హీరో హీరో! డేనీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నంబర్‌ వన్‌’ అంటూ ఈ ప్రచార చిత్రంలో డేనియల్‌ శేఖర్‌గా రానా పలికే సంభాషణలు ఆయన పాత్ర స్వరూప స్వభావాలను వెల్లడిస్తున్నాయి.

తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోందనీ, 2022 జనవరి 12న చిత్రాన్ని విడుదల చేస్తున్నామనీ నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ స్ర్కీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు.

 

Source: https://chitrajyothy.com/telugunews/if-he-is-gabbersingh-i-am-dharmendra-ngts-chitrajyothy-1921092112550760

Leave Your Comment