logo

header-ad
header-ad

Crime news: సైదాబాద్ బాలికపై అత్యాచారం, హత్య ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు..

Hyderabad Police: హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకల రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లాలో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. యాదాద్రి జిల్లాలోని రాజు స్వగ్రామం అడ్డగూడురులో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. నిందితుడు రాజును అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ వెల్లడించారు. నగరంలోని సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక.. పక్కనే ఉన్న రాజు ఇంట్లో అనుమానాస్పద రీతిలో గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. బాలికను తీసుకెళ్లిన రాజు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసి పరారయ్యాడు.

 

Source: https://tv9telugu.com/crime/hyderabad-police-arrested-saidabad-girl-raped-accused-raju-telangana-crime-news-535671.html

Leave Your Comment