logo

header-ad
header-ad

పెట్రో పిడుగు.. పెరిగిన హోల్‌సేల్‌ ధరల సూచి

పెట్రోల్‌ ధరల పెరుగుదల తయారీ పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. అందుకు తగ్గట్టే ఆగస్టుకి సంబంధించి హోల్‌సేల్‌ ప్రైజ్‌ ఇండెక్స్‌ (డబ్ల్యూపీఐ) పెరిగింది. జులైలో డబ్ల్యూపీఐ 11.16 శాతం ఉండగా ఆగస్టుకి వచ్చే సరికి 11.39 శాతానికి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరమంతా డబ్ల్యూపీఐ రెండంకెలకు పైగానే నమోదు అవుతూ వస్తోంది.

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో నెగిటివ్‌గా ద్రవ్యోల్బణం నమోదైంది, 2020 మేలో డబ్ల్యూపీఐ - 3.4 శాతంగా ఉండగా ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2020 ఆగస్టున డబ్ల్యూపీఐ నెటటీవ్‌ను దాటి 0.4 శాతంగా నమోదు అవగా ఏడాది తిరిగే సరికి అది 11.39 శాతానికి చేరుకుంది. 

ఆహారేతర ఉత్పత్తులు, ఖనిజాలు, పెట్రో కెమికల్స్‌​ తదితర వస్తువుల ధరల్లో హెచ్చుల వల్ల తయారీ రంగంలో ధరలు పెరుతుండగా మరోవైపు కన్సుమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌కి సంబంధించి ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. డబ్ల్యూపీఐ, సీపీఐల మధ్య ఈ తేడా ఎప్పుడూ ఉంటుందని ఇండియా రేటింగ్‌ , రీసెర్చ్‌ చీఫ్‌, ప్రముఖ ఎకనామిస్ట్‌ దేవేంద్ర పంత్‌ తెలిపారు.

Source: https://www.sakshi.com/telugu-news/business/high-fuel-prices-push-august-wpi-inflation-1395664

Leave Your Comment