శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనాలని ఆశ పడుతున్నారా..? సెక్స్ విషయంలో ఇరగదీసి మీ భాగస్వాని మరింత ఆకర్షించుకోవాలని కోరుకుంటున్నారా..? అయితే మీరు ఈ విషయాల గురించి తెలుసుకోవాల్సిందే. శృంగారానికి ముందు తినే ఆహారం కూడా మీ సెక్స్ లైఫ్‌ని బాగా ప్రభావితం చేస్తుంది. సెక్స్ చేయడానికి ముందు మీరు ఏం తింటున్నారా అనే దానిపై మీ శృంగార సామర్థ్యం ఆధారపడి ఉంటుందట.
కొన్ని తినడం వల్ల మీరు మరింత ఎక్కువ సేపు సెక్స్ చేయగలిగితే.. కొన్నింటిని తినడం వల్ల చాలా త్వరగా అలసిపోతారట. కాబట్టి శృంగారంలో ఇరగదీయాలనుకునే వారు సెక్స్ చేయడానికి ముందు ఏం తినాలో.. ఏం తినకూడదో తెలుసుకోక తప్పదు. అవేంటో చూద్దాం!
1. నత్తగుల్లలు
వీటిలో జింక్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలో టెస్టోస్టెరాన్ తయారీకి సహాయపడుతుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు, సెక్స్ డ్రైవ్‌లో పెద్ద పాత్ర పోషించే హార్మోన్లను బలపరుస్తుంది. జింక్ కూడా పురుషుల్లో స్పెర్మ్ ఎక్కువ తయారు కావడానికి సహాయపడుతుంది.
ఒకవేళ ఇవి తినడానికి ఇష్టపడని వాళ్లు.. గొడ్డు మాంసం, పంది మాంసం, బలవర్థకమైన తృణధాన్యాలు, గుమ్మడికాయ గింజలు, జీడిపప్పు, పెరుగు లాంటి జింక్ అధికంగా ఉన్న ఇతర ఆహారాలపై తినడం వల్ల ఎక్కువ సేపు సెక్స్ చేయగలుగుతారు.
2. దానిమ్మ
దానిమ్మ సంతానోత్పత్తికి చిహ్నంగా, సెక్స్ సామర్ధ్యాన్ని పెంచేదిగా పనిచేస్తుందని మన పూర్వీకులు చెబుతుంటారు. ఇది నిజమేనని కొన్ని స్టడీలు చెబుతున్నాయి.. దానిమ్మ రసం తాగడం వల్ల మానసిక స్థితి పెరుగడంతో పాటు, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచి మీరు మీ పడకగదిలో ఎక్కువ సేపు గడిపేందుకు సహాయపడుతుంది.
3. చాక్లెట్
చాక్లెట్, రొమాన్స్ రెండింటికీ చాలా దగ్గరి సంబంధం ఉందని మనకు తెలిసిందే. చాక్లెట్ లో ఆనందాన్ని పెంచే సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మీ మూడ్ ను బూస్ట్ చేసి సెక్స్ డ్రైవ్‌ను కూడా పెంచుతుంది.
4. బచ్చలికూర
సాధారణంగా బచ్చలికూర సెక్సీ కూరగాయగా భావించబడదు. కానీ ఇది మీ సెక్స్ డ్రైవ్‌ను చాలా మార్గాల్లో పునరుద్ధరించగలుగుతుంది. ఈ ఆకుకూరలో మెగ్నీషియం పుష్కలంగా ఉండే మీ టెస్టోస్టెరాన్ ను పెంచుతుంది. ఇందులోని ఇనుము మనిషిలోని కోరిక, ప్రేరేపణ, ఉద్వేగం, లైంగిక సంతృప్తికి పెంచేందుకు సహాయపడుతుంది, ముఖ్యంగా మహిళల్లో.
5. పుచ్చకాయ
పుచ్చకాయలోని సిట్రులైన్ అనే అమైనో ఆమ్లాన్ని పుష్కలంగా అందిస్తుంది. ఇది మీ శరీరంలోని రక్త నాళాలను సడలించడానికి సహాయపడే మరొక అమైనో ఆమ్లం అర్జినిన్‌గా మారుస్తుంది. మీ లైంగిక అవయవాలలో రక్తం పంపింగ్ చేయడం వల్ల వయాగ్రా అంగస్తంభన చికిత్సకు పనిచేస్తుంది.
6. అవకాడో
అవకాడో గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది పడకగదిలో మీకు శాశ్వత శక్తిని అందిస్తుంది. అవకాడోలో విటమిన్ బి 6 కూడా ఉంటుంది, ఇది నిపుణులు అలసట, ఉబ్బరం, పిచ్చితనం వంటి PMS లక్షణాలను తగ్గించడానికి ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబు తుంటారు. ఇవన్నీ స్త్రీలు శృంగార మానసిక స్థితికి చేరుకోవడాన్ని సులభతరం చేస్తాయి.
7.స్ట్రాబెర్రీస్
శృంగార ప్రియులకు స్ట్రాబెర్రీలు బాగా ఇష్టమైనవి. వీటిలో అధికంగా ఉండే విటమిన్- సి మీ సెక్స్ డ్రైవ్‌ను పునరుద్ధరించడానికి, రక్త ప్రవాహాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. లైంగిక ప్రేరణ, ఉద్వేగం పెంచే ఆక్సిటోసిన్ అని పిలువబడే హార్మోన్ విడుదల చేసి, ఎక్కువసేపు సెక్స్‌లో పాల్గొనేలా చేస్తుంది.
8. కాఫీ లేదా టీ
కాఫీ, టీ లాంటివి శరీరానికి కెఫిన్ అందిస్తాయి. ఇది మీ నాడీ వ్యవస్థను ప్రోత్సహించి పురుషులు పడకగదిలో మెరుగ్గా రాణించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. అంగస్తంభన అవకాశాలను కూడా తగ్గిస్తుంది. కాఫీ, టీలలో యాంటీఆక్సిడెంట్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే, నిద్రవేళకు దగ్గరగా కాకుండా ఇతర సమయాల్లో తాగితే మీ సెక్స్ డ్రైవ్ ను పెంచుతుంది.
9. చేప కొవ్వు
సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ వంటి చేపలలో ఒమేగా -3 లు పుష్కలంగా ఉన్నాయి. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో మంటను తగ్గిస్తాయి. దీంతో పాటు మీ లైంగిక ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు సీఫుడ్ అభిమాని కాకపోతే అవిసె గింజలు, చియా విత్తనాలు, అక్రోట్లను పొందవచ్చు.
శృంగారానికి ముందు తినకూడనివి..
మద్యపానం
మద్యపానం మీకు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. కానీ అవసరానికి మించి తాగడం వల్ల మీ లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఆల్కహాల్ టెస్టోస్టెరాన్‌ను తగ్గిస్తుంది, నాడీ వ్యవస్థ పనితీరును కూడా తగ్గిస్తుంది. రక్త ప్రసరణ, నరాల సున్నితత్వంపై ప్రభావితం చూపుతుంది. ఫలితంగా మీరు ఎక్కువ సేపు సెక్స్ చేయలేరు.
సంతృప్త కొవ్వులు(సాచురేటెడ్ ఫ్యాట్స్)
కొవ్వు అధికంగా ఉండే గొడ్డు మాంసం, వెన్న వంటి ఆహారాలు కాలక్రమేణా మీ ప్రసరణను దెబ్బతీస్తాయి. ఇది మీ లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది. వీటిని తినడం వల్ల శృంగారం చేసే సమయంలో అసహ్యకరమైన వాసన వస్తుంది ఇది మీ భాగస్వామికి ఇబ్బంది కలిగిస్తుంది.