logo

header-ad
header-ad

సెక్స్ మధ్యలో కండోమ్ తొలగించకూడదు : కాలిఫోర్నియా కీలక నిర్ణయం

డేటింగ్ కి వెళ్లినప్పుడు మీరు మీ పార్ట్ నర్ ఎలాంటి ప్రశ్న అడుగుతారు మీ సంగతేమో కానీ అమెరికాలో మాత్రం అమ్మాయిలు ముందుగా తమ పార్ట్ నర్ ని కండోమ్ ఉందా అని అడుగుతారు. ఒకవేళ వాళ్ల దగ్గర కండోమ్ లేదు అనే సమాధానం వస్తే.. డేట్ క్యాన్సిల్ చేసి మరీ వాళ్లు అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఒక్కోసారి కండోమ్ లేకపోవడం వల్ల రిలేషన్స్ కూడా ముగిసిపోయే ప్రమాదం ఉంది. అందుకే అక్కడి అబ్బాయిలు కచ్చితంగా తమ వెంట కండోమ్ ప్యాకెట్ ని క్యారీ చేస్తారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ గత గురువారం (అక్టోబర్ 7న) ఒక బైపార్టిసాన్ బిల్లుపై సంతకాలు చేశారు. స్టెల్తింగ్... అంటే ఏకాభిప్రాయం లేకుండా రహస్యంగా కండోమ్ తీసేయడాన్ని నిషేధించే బిల్లును ఆమోదించారు.

పార్ట్ నర్ సెక్స్ మధ్యలో అనుమతి లేకుండా కండోమ్ తీసేస్తే వారిని నేరస్తులుగా పరిగణనించడమే ఈ చట్టం ఉద్దేశం. కాగా.. ఏబీ 453 పేరిట కాలిఫోర్నియా కొత్త బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లును కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యురాలు క్రిస్టినా గార్సియా ప్రతిపాదించగా ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని సెక్సువల్ బాటరీ అనే చట్టానికి ఈ కొత్త చట్టాన్ని జోడిస్తారు. దీంతో ఇప్పుడు సంభోగం మధ్యలో సమ్మతి లేకుండా కండోమ్ తీసేయడం చట్టవిరుద్ధంగా చేసిన మొదటి రాష్ట్రం కాలిఫోర్నియా అయ్యింది.

దశాబ్దాల క్రితం ఇదే పరిస్థితి ఎదుర్కుని ప్రస్తుతం శాన్ఫ్రానిస్కోలో ఉంటున్న డూగన్ లాంటి వారికి ఈ చట్టం కచ్చితంగాన్యాయ పరిహారం అందిస్తుంది. డూగన్ కే కాకుండా ఇలాంటి పరిస్థితే ఎదుర్కున్న మిగతా బాధితుల విషయంలో కూడా ఇది ఒక గణనీయమైన మార్పును తీసుకొస్తుందని లాయర్లు చెబుతున్నారు. ఇది అనైతికమే కాదు చట్టవిరుద్ధం అని కూడా మేం చెప్పాలనుకుంటున్నాం అని ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టిన కాలిఫోర్నియా అసెంబ్లీ మెంబర్ క్రిస్టినా గార్సియా అన్నారు. లైంగిక వేధింపులకు సంబంధించి కాలిఫోర్నియా సివిల్ కోడ్లోని సెక్షన్ 1708.5ను సవరిస్తూ 453 బిల్లును తీసుకురావడం జరిగింది. సంభోగ సమయంలో ఏ విధంగాను భాగస్వామిని గాయపరిచేలా వ్యవహరించడం నేరం అని 1708.5 సెక్షన్ పేర్కొంటోంది.

అంటే.. భాగస్వామి(ఆమె అతడు) జననాంగాలను ఇతర ప్రైవేట్ పార్ట్స్ను గాయపరచకూడదు. దీనికి కొనసాగింపుగా తీసుకొచ్చిందే 453 బిల్లు. శృంగార సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్స్ తొలిగించడానికి వీల్లేదు. ఒకవేళ భాగస్వామి అనుమతి లేకుండా సంభోగం మధ్యలో కండోమ్ తొలగిస్తే అది నేరంగా పరిగణించబడుతోంది. ఇక తాజాగా రాష్ట్ర శాసన సభలో ఈ బిల్లు ఆమోదం పొందడంపై అసెంబ్లీ సభ్యురాలు బిల్లు రూపకర్త క్రిస్టినా గార్సియా సంతోషం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో న్యూయార్క్ సెనేట్లో కూడా 2019 మార్చిలో డయాన్ జే సేవినో కూడా ఎస్ 4401 పేరిట ఓ బిల్లును ప్రవేశపెట్టారు. న్యూయార్క్ రాష్ట్ర సెనేట్ వెబ్ సైట్ ప్రకారం ప్రస్తుతం ఇంకా ఈ బిల్లు సెనేట్ లోనే ఉంది. అటు విస్కాన్సిన్ రాష్ట్ర ప్రతినిధి మెలిస్సా సార్జెంట్ కూడా ఇదే విషయమై 2017లో ఓ బిల్లును ప్రతిపాదించారు. అయితే ఈ బిల్లు భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తొలగిస్తే.. అవాంఛిత గర్భం లైంగిక సంబంధిత అంటు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని పేర్కొంటోంది.

కానీ పౌరులు వేసిన కేసుల్లో ఏదైనా అస్పష్టత ఉంటే గార్సియా తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం దానిని తొలగిస్తుంది. మిగిలిన బాధితులు తమ కేసులను ముందుకు తీసుకెళ్లడం ఈ చట్టంతో సులభం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అన్ని అంశాల్లాగే దీనిపై కూడా మనం ఇక చర్చించుకోవచ్చు అంటున్నారు గార్సియా. స్టెల్తింగ్ అనేది సర్వ సాధారణంగా జరుగుతున్నట్లు కాలిఫోర్నియా సెనేట్ జ్యుడీషియరీ కమిటీ అధ్యయనంలో తేలింది.నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసన్ 2019లో ఒక పేపర్ ప్రచురించింది. 21- 30 ఏళ్ల మధ్యలో ఉన్న 12 శాతం మంది మహిళలకు స్టెల్తింగ్ అనుభవం ఎదురైనట్లు 2019లో చెప్పారు.పురుషులతో సెక్స్ లో పాల్గొనే ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక మహిళ ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒక పురుషుడు దీనికి గురవుతున్నారని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా గుర్తించారు. దాదాపు 10 శాతం పురుషులు సంభోగ సమయంలో సమ్మతి లేకుండానే కండోమ్ తీసేస్తున్నట్లు 2019లో జరిగిన మరో అధ్యయనంలో తేలింది.

ఇప్పుడు స్టెల్తింగ్ మీద అవగాహన పెరిగింది. కానీ దానికి స్పందించడానికి చట్టసభలు వెనకాడుతున్నాయి. స్టెల్తింగ్ ను లైంగిక దాడిగా పరిగణిస్తున్న బ్రిటన్ న్యూజీలాండ్ జర్మనీ లాంటి దేశాల్లో కూడా దాని వెనుక ఉద్దేశాన్ని నిరూపించడంలో సమస్యలు ఎదురవడంతో అలాంటి కేసులు అరుదుగా విచారణ వరకూ వస్తున్నాయి. స్టెల్తింగ్ చట్టవిరుద్ధం అని అధికారికంగా చెప్పడం ద్వారా అంతర్గత ప్రయోజనం కలుగుతుందని బ్రాడ్ స్కీ గార్సియా ఇద్దరూ అంటున్నారు. డూగాన్ స్థాపించిన లా సంస్థ ఎరోటిక్ సర్వీస్ ప్రొవైడర్స్ లీగల్ ఎడుకేషనల్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్(ఈఎస్ పీఎల్ ఈ ఆర్ పీ) ఈ బిల్లుకు మద్దతిచ్చింది. సంభోగం సమయంలో కండోమ్ తొలగించిన క్లయింట్లపై సెక్స్ వర్కర్లు కేసులు పెట్టడానికి ఈ చట్టం అనుమతిస్తుంది.

Source: https://www.tupaki.com/politicalnews/article/Condoms-should-not-be-removed-in-the-middle-of-romance/305875

Leave Your Comment