అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై జాతీయ మీడియాతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అలా చేస్తే ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. అమరావతి భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందన్నారు. దర్యాప్తులో బినామీలంతా బయటపడటం ఖాయం అన్నారు. రాజధాని కోసం వేల ఎకరాలు, లక్షల కోట్లు అనవసరం అని సీఎం జగన్ జాతీయ మీడియాతో అన్నారు

Source: https://www.andhrajyothy.com/telugunews/cm-jagan-comments-2020090910482620