logo

header-ad
header-ad

బాలయ్య నుండి మరో ఫాంటసీ మూవీ ?

బాలయ్య బాబు కోసం డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ కథ రాస్తున్నాడని.. వచ్చే ఏడాది వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ కథ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. మొదటిసారి పూరి ఓ పూర్తి ఫాంటసీ స్టోరీ రాసినట్టు తెలుస్తోంది. చారిత్రాత్మకకు చెందిన ఓ రాజు.. పొరపాటున ఈ భూమి మీదకు వస్తే.. అతను తన రాజరికాన్ని చూపించే క్రమంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేది మెయిన్ లైన్ అట. కాగా సినిమాలో వ్యంగ్యం ఉన్నా.. మెయిన్ గా ఫుల్ యాక్షన్ తోనే సినిమా నడుస్తోందని తెలుస్తోంది.

ఇప్పటికే బాలయ్య – పూరి కాంబినేషన్‌లో ‘పైసా వసూల్’ చిత్రం వచ్చింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఆ సినిమాలో బాలయ్యను చాల కొత్తగా చూపించాడు పూరి. అందుకే పూరితో మరో సినిమా చేయడానికి తానూ ఎప్పుడూ రెడీనే అని ఆ మధ్య బాలయ్య కూడా చెప్పుకొచ్చాడు. మొత్తానికి వచ్చే ఏడాదిలో వీరి సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఇక చాన్నాళ్లకు ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేసిన పూరి.. ఆ సక్సెస్ ఇచ్చిన కిక్ తో వరుసగా హిట్స్ కొడతాడేమో చూడాలి.

Source: https://www.123telugu.com/telugu/news/balayya-to-join-hands-with-puri-in-fantacy-story.html

Leave Your Comment