logo

header-ad
header-ad

Andhra Pradesh: మిర్చి కల్లాల్లో ఏక్‌ధమ్ సెక్యూరిటీ.. అన్నదాతలంటే మామూలుగుండదు మరి..

Guntur Mirchi: శాంతి భద్రతల సమస్య తలెత్తె చోట పోలీసులు సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తారనే విషయం తెలిసిందే. లేదంటే షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం సాధారణంగా చూస్తుంటాం. ఇంకాపోతే.. ఇళ్ల వద్ద సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. అయితే, ఇక్కడ ఏకంగా వ్యవసాయ ఉత్పత్తుల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఎక్కడా అనుకుంటున్నారా?. గుంటూరు జిల్లా యడ్లపాడులో మిర్చి కల్లాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు పలువురు రైతులు‌.

ఈ ఏడాది తామర పురుగు ఆశించడంతో మిర్చిలో దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో మిర్చికి గిరాకీ పెరిగింది. ఇదే అదునుగా భావించిన కొంతమంది దొంగలు పొలాల్లో ఆరబోసిన మిర్చి కల్లాల వద్ద నుండి మిర్చిని దొంగలించుకుపోతున్నారు. నాదెండ్ల, తిమ్మాపురంలోనూ మిర్చిని దొంగలు ఎత్తుకెళ్ళారు‌. దీనిపై స్థానిక రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలాల్లో మిర్చి పోవటంతో పోలీసులకు దొంగలను పట్టుకోవటం కష్టంగా మారింది.

ఈ నేపథ్యంలోనే రైతులు వినూత్నంగా ఆలోచించారు. తమ మిర్చి పంటను కాపాడుకునేందుకు కల్లాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. వేణు గోపాల్, శ్రీనివాస్, హరిబాబు అనే ముగ్గురు రైతులు కలిసి తమ కల్లాల వద్ద సిసి కెమెరాలు పెట్టారు. ఊరికి దగ్గరలోనే కల్లాలుండటంతో సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకున్నారు. ఏడెనిమిది మంది రైతులు కలిసి కల్లం ఏర్పాటు చేసుకున్నారు. కల్లం చుట్టూ నాలుగు సిసి కెమెరాలు పెట్టారు. సిసి కెమెరాలు ఏర్పాటుతో ధైర్యంగా కల్లాల్లో మిర్చి ఆరబోసుకుంటున్నామని రైతు వేణుగోపాల్ చెప్పారు. ఏదిఏమైనా ఆధునిక సాంకేతికత ఈ రూపంలో రైతులకు ఉపయోగపడుతుంది.

Source: https://tv9telugu.com/andhra-pradesh/in-andhra-pradesh-guntur-mirchi-farmers-installed-cc-cams-at-farm-places-631697.html

Leave Your Comment