logo

header-ad
header-ad

Crime News: ఛీఛీ.. దంపత్యానికే సిగ్గుచేటు.. కట్టుకున్న భార్యను అలా చేయమన్న భర్త..

వారికి పెళ్లైంది. ఒక రోజు భార్య పడక గదిలో ఉండగా భర్త హాల్లో ఉన్నాడు. పడక గదిలో భార్య కేకలు వేయడంతో అతడు వెంటనే అక్కడి వెళ్లారు. అక్కడ తన తమ్ముడు కనిపించగా ఏమైందని భార్యను అడిగాడు. ఆమె తనపై మీ తమ్ముడు అఘాయిత్యం చేయబోయాడని భర్తకు వివరించింది. దీంతో భర్తకు కోపం వచ్చి అతడి తమ్ముడిని కొడతాడని ఆమె అనుకుంది. కానీ భర్త చెప్పిన మాటలు విని ఆ భార్యకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఇలాంటి భర్త కూడా ఉంటారా అనుకుంటూ భయపడిపోయింది. ఇంతకీ ఆ భర్త ఎమన్నాడంటే..

మధ్యప్రదేశ్‌లోని మొరేనాలోని ఆదర్శ్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి 2018, మార్చి 6న ఓ అమ్మాయితో వివాహం జరిగింది. పెళ్లైనప్పటినుంచి అతను తన భార్యతో అంత చనువుగా ఉండడం లేదు. భార్యతో కాకుండా మరో గదిలో నిద్రపోయేవాడు. ఇదే విషయమై వారి మధ్య గొడవలు కుడా జరిగాయి. అయినా అతడు భార్యకు అంట్టిముట్టనట్లుగానే ఉంటున్నాడు. ఇది గమనించిన ఆ వ్యక్తి సోదరుడు వదినపై కన్నేశాడు. వదినను ఎలాగైనా లోబర్చుకోవాలని ప్రయత్నించాడు. అవకాశం చూసుకోని ఓ రోజు వదిన పడక గదిలోకి దూరాడు. అతడు వచ్చి తనన బలవంతం చేయటంతో ఆమె గట్టిగా అరిచింది. అరుపులు విన్న భర్త వెంటనే గదిలోకి వచ్చాడు. అక్కడ తన తమ్ముడు ఉండడం చూసి ఏమైందని అడిగాడు. ‘మీ తమ్ముడు నాపై అత్యాచారం చేయడానికి యత్నించాడు. ఎలాగైనా మీరే బుద్ది చెప్పండి’ అని జరిగిందంతా భర్తు వివరించింది. కానీ భర్త నుంచి ఆమెకు ఊహించి రిప్లే వచ్చింది. భర్త చెప్పిన మాటలు ఆమె ఖంగుతిన్నది. ఈ భర్త ఎమన్నాడంటే..

‘నోరు మూసుకో.. నువ్వు ఇలానే అరిస్తే నీ జీవితం నువ్వు చెడగొట్టుకుంటావ్. నువ్వు మా తమ్ముడితో కలివిడిగా ఉండు. వాడు చెప్పిందల్లా చెయ్..’అని అనడంతో ఆమె షాక్‌కు గురైంది. భర్త అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మరిది ఆమెను బలవంతం చేసి లొంగదీసుకున్నాడు. ఆమెతో కలిసి ఉన్న ఫొటోలు చూపిస్తూ.. ప్రతిరోజూ లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. కొన్నిరోజుల క్రితంఓ పాపకు జన్మనిచ్చింది. ‘పాప నాకు పుట్టింది కాదు. నీ మీద నాకు మనసెప్పుడో చచ్చిపోయింది. నువ్వు మా తమ్ముడినే పెళ్లిచేసుకో’అని భర్త తెగేసి చెప్పాడు. ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకున్న ఆమె బుధవారం మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. జరిగిందంతా వివరించింది. మహిళ చెప్పింది విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అదుపులోకి తీసుకుంటామని అక్కడి పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

Source: https://tv9telugu.com/crime/a-man-miss-behavioured-with-his-brother-wife-in-madyapradhesh-548819.html

Leave Your Comment